Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మార్స్ పై రాత్రి ఎలా ఉంటుంది?... నాసా రోవర్ తీసిన వీడియో ఇదిగో!

Nasa rover Footage of night on Mars
Advertisement
  • పౌర్ణమి వంటి సమయంలో వెన్నెల వెలుగులు ఉంటే... అమావాస్యకు చిమ్మ చీకటి అలుముకుంటుంది
  • మరి అంగారక గ్రహంపై రాత్రి ఎలా ఉంటుందనే వీడియోను నాసా విడుదల చేసింది
Advertisement
చీకటి పడిందంటే.. ఆకాశంలో చందమామ, నక్షత్రాలు కనువిందు చేస్తాయి. పౌర్ణమి వంటి సమయంలో అయితే వెన్నెలతో కాస్త వెలుగు ఉంటే... అమావాస్య సమయంలో చీకటి దట్టంగా అలుముకుంటుంది. మరి మన సౌర కుటుంబంలో జీవం ఉనికి ఉండే అవకాశమున్న మార్స్‌ (అంగారకుడి)పై రాత్రి ఎలా ఉంటుందో తెలుసా? దీనికి సంబంధించి మార్స్‌ పై తిరుగాడుతున్న నాసా రోవర్‌ ‘క్యూరియాసిటీ’ అద్భుతమైన వీడియోలను చిత్రీకరించింది. వాటిని నాసా ఎక్స్‌ (ట్విట్టర్‌)లో ‘క్యూరియాసిటీ’ పేరిట ఉన్న ఖాతాలో పోస్టు చేసింది.

వాతావరణం లేకపోవడంతో...
భూమిపై మనం వాడే విద్యుద్దీపాల వెలుగు కారణంగా ఆకాశం సరిగా కనిపించదు. అందుకే నగరాలకు దూరంగా కొండలు, గుట్టల ప్రాంతాలకు వెళ్లి ఆకాశాన్ని పరిశీలిస్తూ ఉంటారు. అంగారకుడిపై ఈ సమస్య లేదు. పైగా భూమితో పోలిస్తే అంగారకుడిపై వాతావరణం చాలా పలుచగా ఉంటుంది. అందువల్ల అంతరిక్షం నుంచి వచ్చే వెలుగు నేరుగా ప్రసరిస్తూ ఉంటుంది. దీనితో అంగారకుడిపై రాత్రిపూట కూడా కొంత మేర వెలుతురు కనిపిస్తుంది. నక్షత్రాలు అయితే మరింత స్పష్టంగా అత్యంత ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి.
Advertisement
Advertisement
Nasa
offbeat
Viral Videos
Curiosity
Mars
science

More Telugu News